Yogasanalu యోగాసనాలు
యోగాసనాలు ( ప్రపంచ శ్రేయస్సుకు భారతీయ వారసత్వ సంపద )
యోగాభ్యాసంతో చేకూరే ప్రయోజనాల వలన మన దేశంలోనూ, ఇతర దేశాలలో కూడా యోగాభ్యాసం\
యొక్క ఆదరణ నానాటికీ పెరుగుతోంది. ఈ పుస్తకంలో 50 ముఖ్యమైన ఆసనాలను వేసే
పద్ధతులను, ఆ ఆసనాలను వేయడం వలన కలిగే ప్రయోజనాలను, వాటి పరిమితులను,
ఆసనాలు వేసేటప్పుడు గమనించవలసిన విషయాలను వివరించారు. ఆసనాలు వేసే పద్ధతులను
సచిత్రంగా వివరించడం వలన ఈ పుస్తకం యోగాభ్యాసంలో ఆసక్తి ఉన్నవారికి చాలా
ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ముద్రలు, ప్రాణాయామంలోని వివిధ రకాలు,
వాటిని చేసే పద్ధతులు వివరించడం జరిగింది.
ఇతర పుస్తకాలలో ఉన్నట్లు ఒకటి రెండు చిత్రాలతో కాకుండా, ఈ పుస్తకంలో ఆసనాలను ప్రారంభస్థితి నుంచి ఆసనం యొక్క చివరి స్థితి వరకూ తిరిగి యథాస్థితికి వచ్చేందుకు కావలసిన వివిధ దశలలో చిత్రాలను ఇవ్వడం జరిగింది.